
● బాలుడు, యువకుడు మృతి ● బైక్‌తో అగి ఉన్న లారీని ఢీకొన్న వైనం ● పండుగ వేళ ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం... గుడిపేట గ్రామానికి చెందిన సంగెం శ్రీధర్ (చింటూ) (20), శ్రీహరి(14) ద్విచక్ర వాహనంపై రాత్రి వేళ బయటకు వచ్చారు. జాతీయ రహదారిపై స్పోర్ట్ బైక్‌పై అతివేగంతో వెళ్తూ బెటాలియన్ శివారులో లక్సెట్టిపేట వైపు వెళ్తున్న వెళ్తున్న లారీ జాతీయ రహదారిపై నిలిపి ఉండగా దానిని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పారిపోయాడు. సీఐ తోట సంజీవ్, హాజీపూర్ ఎస్సై ఉదయ్‌కిరణ్ సంఘటన స్థలానికి చేరుకుని వాహన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. మృతదేహాలను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
శ్రీహరి మృతదేహం
శ్రీధర్ మృతదేహం
