
ప్రతి పాఠంలోని వ్యాకరణ అంశాలు క్షుణంగా అభ్యాసం చేయాలి. ద్వితీయ భాషా హిందీలో 80 (పార్ట్ ఏ, బీ)లో 16 అంకేలు వస్తే పాస్. 100లో 20వస్తే పాస్ అవుతారు. పేరాగ్రాప్ పద్యాలు, వ్యాకరణ అంశాలు అభ్యాసం చేస్తే పక్క ఉత్తీర్ణులవుతారు. సృజనాత్మకతను పరీక్షించే లేఖారచన, వ్యాసాలు, సాక్షాతాకర్, కరపత్ర పోస్టర్ అంశాలను బాగా చదవాలి. బాషాదోషాల్లేకుండా అందంగా రాసేందుకు ప్రయత్నించాలి. పార్ట్ బీలో వ్యాకరణాంశాలుంటాయి. పాఠ్యపుస్తకంలోని బాషాకి బాత్ ఆధారంగా అభ్యసించాలి.
– నీలేష్ కుమార్, హిందీ ఉపాధ్యాయుడు
