
రికార్డులు పరిశీలిస్తున్న డీటీసీ శ్రీనివాస్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం వేంపల్లిలోని జిల్లా రవాణా శాఖా కార్యాలయంలో బుధవారం సాయంత్రం జిల్లా రవాణా శాఖా ఉప కమిషనర్ డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో వివిధ రకాల రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై ఆరా తీసి తీరు మార్చుకోవాలని సూచనలు చేశారు. విధుల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, వివిధ కార్యకలాపాల నిమిత్తం వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలిగించవద్దని, సేవలు సత్వరంగా అందేలా చూడాలని తెలిపారు. ఇక రవాణా శాఖ పన్నుల లక్ష్యం చేరుకోవడంపై అభినందిస్తూ మరింత వసూళ్లు చేపట్టి రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానంలో నిలపాలని అన్నారు. డీటీఓ కిష్టయ్య, సీనియర్ ఎంవీఐ వివేకానంద్‌రెడ్డి, ఎంవీఐలు రాహుల్‌కుమార్, యోగేశ్వర్‌సింగ్, ఏఎంవీఐలు కొమ్ము శ్రీనివాస్, శ్రీకాంత్, ప్రత్యూషరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.