
నిరసన తెలుపుతున్న ఎల్‌ఐసీ ఉద్యోగులు
పాతమంచిర్యాల: ఉద్యోగుల జీవన భద్రతను హరిస్తున్న కొత్త పింఛన్ విధానం రద్దుచేసి బీమా సంస్థల ఉద్యోగులకు పాత పింఛన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో సేవలు అందిస్తున్న ఉద్యోగుల పింఛన్ సొమ్మును ప్రభుత్వం స్టాక్ మార్కెట్‌లో పెట్టడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల బేసిక్ వేతనంలో 30 శాతం కనీస పింఛన్ చెల్లించాలని, ఎల్‌ఐసీ, జీఐసీల ప్రైవేటీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీమా ఉద్యోగుల సంఘం మంచిర్యాల శాఖ అధ్యక్షుడు గోపీకృష్ణ, సంయుక్త కార్యదర్శి చరణ్, కరీంనగర్ డివిజన్ సంయుక్త కార్యదర్శి ఆర్ రాజేశం, తిరుపతిరెడ్డి, సమత్‌కుమార్, హిమశ్రీ,సోనీ, మౌనిక, సుష్మ,సౌమ్య తదితరులు పాల్గొన్నారు.