
వరద గుప్పిట్లో మూత‘బడి’
ఉపాధ్యాయుల బోధనలు, విద్యార్థుల ఆటపాటలతో కళకళలాడాల్సిన పాఠశాల ఇలా వరద గుప్పిట్లో చిక్కుకొని మూతబడింది. చిన్నపాటి వర్షం కురిసినా నారాయణపేట జిల్లా మరికట్ మండలంలోని పస్పుల గ్రామ ప్రాథమిక పాఠశాలలోకి వరద నీరి చేరి చెరువును తలపిస్తోంది. వరద తగ్గిన తర్వాత దోమల బెడద, దుర్వాసనతో విద్యార్థులు చదువుకోలేకపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి పాఠశాలలో వర్షపు నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – మరికల్

వరద గుప్పిట్లో మూత‘బడి’