నవాబుపేట: మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో పల్లెగడ్డ గ్రామ శివారులో స్వయంభూగా ఆదిబసవేశ్వరస్వామి వెలిశారు. స్వామివారి ఉత్సవాలు గురువారం నుంచి ప్రా రంభం కానున్నాయి. ప్రతి ఏటా ఉత్నవాలు హోలీకి ముందు రోజు ఉత్సవాలు ప్రారంభిస్తారు. గురువారం ప్రారంభమయ్యే సోమవా రం ముగుస్తాయి. 13న ప్రభోత్సవం, 14న రథోత్సవం, 15న శకటోత్సవం, 16న అగ్నిగుండం, 17న శివపార్వతుల కల్యాణంతో ఉత్సవాలు ముగుస్తాయని పూజారి శ్రీశైలం, కార్యక్రమ నిర్వాహకులు జంగయ్య, రాజలింగం, ధర్మకర్త భూపాల్‌రెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల దాదాపుగా 70 గ్రామాల ప్రజలు వస్తుంటారు. దాదాపుగా 40 గ్రామల ప్రజలు ఇంటికి ఒకరు చొప్పున విధిగా వచ్చి దేవాలయంలో టెంకాయ కొట్టాలన్న ఆనవాయితీ ఇక్కడ ఉండటంతో అన్ని గ్రామాల ప్రజలు మా ఊరి జాతరగా పిలుస్తుంటారు.
నేటి నుంచి ఆదిబసవేశ్వరస్వామి ఉత్సవాలు