డంపింగ్ యార్డులో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, చెత్త
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంతో పాటు దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల్లో ‘చెత్త’శుద్ధి కరువైంది. మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొందరు ఎక్కడబడితే అక్కడ చెత్తను కుప్పలుగా వదిలేస్తున్నారు. కొన్నేళ్లుగా నగరంలో ఒకవైపు అధికారులు స్వచ్ఛత కార్యక్రమాలు చేపడుతున్నా.. మరోవైపు కొందరు వ్యక్తుల అవగాహన లోపంతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. వాస్తవానికి చెత్త సేకరణకు గాను 69 స్వచ్ఛ ఆటోలు, 19 మున్సిపల్ ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. ఇంటింటికీ వచ్చే స్వచ్ఛ ఆటోలకు వేరు చేసిన తడి, పొడి చెత్త ఇవ్వాల్సి ఉన్నా కొన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి సహకారం లభించడం లేదు.
ఎక్కడబడితే అక్కడ చెత్త వేస్తున్న వైనం
● అధికారులు అవగాహన కల్పిస్తున్నా ప్రయోజనం దక్కని వైనం
● కొందరు ఇప్పటికీ స్వచ్ఛ ఆటోలకు ఇవ్వనితడి, పొడి చెత్త
● మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో నిత్యం 106 మెట్రిక్ టన్నుల సేకరణ
● ప్లాస్టిక్ కవర్లతో గుట్టలుగా పేరుకుపోతున్న డంపింగ్ యార్డు
చెత్త శుద్ధి కరువు..!
చెత్త శుద్ధి కరువు..!