
వీడియోకాన్ఫెరెన్స్‌లో పాల్గొన్న డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్, ఎస్పీ నరసింహ, ఇతర అధికారులు
మహబూబ్‌నగర్ క్రైం: రాబోయే ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో బందోబస్తు పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్, ఎస్పీ కె.నరసింహతో పాటు ఇతర అధికారులతో మాట్లాడారు. అలాగే జాతరలలో నిర్వహించే బందోబస్తులలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతల పర్యవేక్షణ, బందోబస్తు ఏర్పాటు ఇతర అంశాలపై డీజీపీ సూచనలు చేశారు. వీసీలో డీఎస్పీలు టి.మహేష్, ఆదినారాయణ, రమణారెడ్డి, మధు, లక్ష్మణ్, శ్రీనివాసులు, సీఐలు, ఎస్‌ఐ పాల్గొన్నారు.