uమొదటి పేజీ తరువాయి | Sakshi
Sakshi News home page

uమొదటి పేజీ తరువాయి

Published Wed, Mar 29 2023 1:16 AM

-

కార్యాలయంలోగానీ విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. చిట్‌ఫండ్‌ చట్టం నిబంధనలను ఉల్లంఘించి నిధులు మళ్లించడంపై ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజతోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మేనేజర్లపై సీఐడీ అధికారులు ఇప్పటికే కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయాల్లో సీఐడీ అధికారులు విస్తృతంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చిట్‌ఫండ్‌ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్‌ ఫండ్స్‌, షేర్‌ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నట్లు ఆధారాలతో సహా వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్లు 420, 409, 120 బి, 477 రెడ్‌విత్‌ 34, కేంద్ర చిట్‌ఫండ్స్‌ చట్టం–1982, ఆర్థిక సంస్థల రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ కేసులో సీఐడీ అధికారులు నలుగురు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మేనేజర్లను అరెస్టు చేశారు.

● అదో ఆర్థిక నేర సామ్రాజ్యం...

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చందాదారుల సొమ్మును చట్ట విరుద్ధంగా మళ్లించడం ద్వారా రామోజీరావు యథేచ్ఛగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వ చిట్‌ఫండ్స్‌ చట్టం–1982, రిజర్వ్‌బ్యాంకు చట్టం, ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థ బ్రాంచి కార్యాలయాల్లో స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ గత ఏడాది అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో, హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాల యంలో డిసెంబర్‌లో నిర్వహించిన సోదాలతో ఈ అక్రమాల బాగోతం బట్టబయలైంది. సొమ్ములు రాష్ట్రంలోని చందాదారులవి కాగా ఆర్థిక ప్రయోజ నాలు మాత్రం పొరుగు రాష్ట్రంలో మకాం వేసిన రామోజీరావువని వెల్లడైంది. రాష్ట్ర చందాదారుల కష్టార్జితానికి రక్షణ లేదని గుర్తించిన స్టాంపులు– రిజిస్ట్రేషన్ల శాఖ దీనిపై సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావు పేట, అనంతపురంలోని మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ కార్యాలయాల్లో సీఐడీ నిర్వహించిన సోదాల్లో మరి న్ని అక్రమాలు బయటపడ్డాయి. మరోవైపు స్టాంపులు– రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేకంగా ఓ చార్టెడ్‌ అకౌంటెంట్‌ను ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఆర్థిక నివేదికలను పరిశీలించగా పలు అక్రమాలు వెలుగు లోకి వచ్చాయి. ఎంతోమంది చందాదారులు తా ము మోసపోయినట్లు సీఐడీకి ఫిర్యాదులు చేస్తున్నా రు. మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో ఈ అంశంపై దర్యాప్తు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కు సీఐడీ నివేదించింది.

Advertisement
Advertisement