
బస్‌పాస్‌లను అందజేస్తున్న ఎమ్మెల్యే ఆల
దేవరకద్ర: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటూ వారి సంక్షేమం కోసం పాటుపడుతుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవా రం దేవరకద్ర మార్కెట్ యార్డులో 200 మంది దివ్యాంగులకు ఉచిత బస్ పాస్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు ఆర్టీసీ వారు రాయితీ బస్‌పాస్‌లను అందజేస్తుండగా దీనికి గాను పాస్ జారీ రుసుం కింద చెల్లి ంచాల్సిన రూ.50 ప్రకారం 200 మంది దివ్యాంగు లకు మార్కెట్ కమిటీ రూ.10 వేలు చెల్లించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కు రూ.3,016 ఫించన్‌గా ఇస్తూ అండగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మవద్దని వారు చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ అని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.