
పాలమూరు: ప్రావిడెండ్ ఫండ్ సభ్యులు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరిస్తున్నామని, దీనికోసం ప్రతినెలా 27న పీఎఫ్ సభ్యులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామని పీఎఫ్ జిల్లా నోడల్ ఆఫీసర్ రమేష్‌చావా తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాకేంద్రంలోని ఎస్‌వీఎస్ ఆస్పత్రిలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై ప్రతినెలా 27న పీఎఫ్ సభ్యులు, ఉద్యోగులు, పెన్షనర్లుకు ఉన్న సమస్యలపై సదస్సులు ఏర్పాటు చేయడంతోపాటు వాటిని పరిష్కరించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నిధి ఆప్ కే నిక్కడ్–2.0 కార్యక్రమంలో పీఎఫ్‌కు సంబంధించిన వ్యక్తిగత తప్పులను సరి చేస్తామన్నారు. ఐపీఎస్ పెన్షనర్లు మాత్రం తమ పెన్షన్‌కు సంబంధించిన ఆప్షన్లను పీఎఫ్ కమిషనర్ విడుదల చేసిన జీఓ ఆధారంగా ఆన్‌లైన్ ద్వారా పంపించాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ విశ్రాంత ఫోరం అధ్యక్షుడు రాజసింహుడు తదితరులు పాల్గొన్నారు.

సమస్యలను పరిశీలిస్తున్న అధికారి