మామూళ్లకు అలవాటు పడిన సివిల్ సప్లయ్ శాఖలోని ఓ అధికారితో పాటు పలువురు సిబ్బంది సదరు మిల్లు యజమానికి ఎప్పటి నుంచో అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈసారి భారీగా మడుపులు అందుకోవడంతో ఆ అధికారి అన్నీ తానై దగ్గరుండి వ్యవహారాలు నడిపినట్లు తెలుస్తోంది. గత సీజన్‌లోనివే భారీగా పెండింగ్ ఉన్నప్పటికీ రికార్డుల్లో జీరో లేదా అతి తక్కువ మొత్తంలో చూపించి.. సదరు మిల్లు యజమానికి మేలు చేసేలా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇందులో పరిపాలనా పరమైన అనుమతులు ఇవ్వాల్సిన ఓ కీలక అధికారిని సైతం బురిడీ కొట్టించి.. సదరు మిల్లర్‌కు వచ్చే సీజన్‌కు సంబంధించి కేటాయింపులు చేసినట్లు సమాచారం. ఈ బాగోతంలో పెద్ద ఎత్తున చేతులు మారగా.. పలువురు అధికారులు, సిబ్బంది వాటాల చొప్పున పంచుకున్నట్లు తెలిసింది.