
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
నెహ్రూసెంటర్: ఆయూష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వా రా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రవిరాథోడ్ సూచించారు. సబ్ సెంటర్ల ఆరోగ్య కార్యకర్తల సమావేశాన్ని శనివారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా వైద్యులు సేవలందించాల ని సూచించారు. సబ్ సెంటర్ల రిజిస్టర్, ల్యాబ్ వివరాలు, ఓపీ రిజిష్టర్లను పరిశీలించారు. సమావేశంలో హెచ్‌ఈ కేవీ రాజు, ఎస్‌యూఓ రామకృష్ణ, డీపీఎం నీలోహన, ఏఓ వసంత, డీడీఎం సౌమిత్, రాజ్‌కుమార్, సురేష్,అరున్,కార్యకర్తలు పాల్గొన్నారు.
నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
చిన్నగూడూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు అన్ని సదుపాయాలతో నాణ్యమైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్ పేర్కొన్నారు. మండలంలోని ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్‌సీలో ఆస్పత్రి రికార్డులు, జేఏఎస్ మీటింగ్‌కు సంబంధించిన రిజిష్టర్లను పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. చికిత్స నిమిత్తం వచ్చిన సెప్సిస్ ఔండ్ పేషెంట్‌కి డ్రెస్సింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీహెచ్‌సీ వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. అన్ని ఎంసీహెచ్ పారామీటర్లలో ముందు ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రవీణ్ కుమార్, వైద్య సిబ్బంది ఉన్నారు.
డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్