
కలుషిత నీరే దిక్కు..
లీకేజీలు, పగుళ్లతో ఇబ్బందులు
● మున్సిపాలిటీల్లో రోడ్డు మధ్యలో గేట్‌వాల్వ్స్
● తాగునీటిలో డ్రెయినేజీ నీళ్లు చేరుతున్న దుస్థితి
● రోగాల బారిన పడుతున్న ప్రజలు
● లీకేజీలతో ఎగువ ప్రాంతాల్లో నీటి కొరత
● పక్క ఫొటో మహబూబాబాద్ మున్సిపాలిటీలో మురికి గుంటలో ఉన్న నీటి సరఫరా గేట్‌వాల్వ్ పాయింట్. ఇది వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉంది. చిన్న పాటి వర్షం పడినా ఈ గుంతలో నీరు నిలుస్తోంది. దీంతో తాగునీరు కలుషితమై గేట్‌వాల్వ్ ద్వారా ఈప్రాంతంలోని నివాస గృహాలకు సరఫరా అవుతోంది. ఈ నీటిని తాగడమే కాకుండా వంటల్లోకి వినియోగించడంతో రోగాలబారిన పడుతున్నారు. ఈ నల్లా నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లోని ప్రజలకు తరచూ విరేచనాలు కావడం, కామెర్లతో బాధపడుతున్నవారు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.
సీజనల్ వ్యాధులు 90శాతం కలుషిత తాగునీటితోనే వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కాగా మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే ట్యాంకుల నుంచి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అవుతున్నప్పటికీ.. పైపులైన్ల లీకేజీలు, పగుళ్లతో కలుషితమవుతోంది. కొన్ని చోట్ల డ్రెయినేజీ నీళ్లు కలిసి సరఫరా జరుగుతుంది. దీంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వానాకాలంలో డయేరియా, కామెర్లు, కిడ్నీ సంబంధిత వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. – సాక్షి, మహబూబాబాద్

కలుషిత నీరే దిక్కు..