
వ్యాధులపై అవగాహన కల్పించాలి
బయ్యారం: సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ సూ చించారు. మండలంలోని బయ్యారం, గంధంపల్లి పీహెచ్‌సీలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం బయ్యారంలో నిర్వహించిన ఆశాడే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడా రు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రతీ ఆరోగ్యకేంద్రంలోని సిబ్బంది బాధ్యత వహించాలన్నారు. అనంతరం బయ్యారం పీహెచ్‌సీ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫీవర్‌వార్డు, ఆపరేషన్ థియేటర్‌ను డీఎంహెచ్‌ఓ ప్రారంభించారు. డాక్టర్స్‌డే సందర్భంగా వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ తో పాటు పలువురు వైద్యులను సన్మానించారు. వైద్యులు విజయ్‌కుమార్, శ్రవణ్‌కుమార్, హనుమంతరావు, శివ, ఉస్మాన్, సుధీర్, మాస్‌మీడియా అధికారి ప్రసాద్, హెల్త్ ఎడ్యుకేటర్ కె.వి.రాజు, సబ్‌యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ ఉన్నారు.
అందుబాటులో ఉండాలి
నెహ్రూసెంటర్: వైద్యులు, ఆరోగ్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని బస్తీ దవాఖానలోని మందుల గిడ్డంగిని మంగళవారం తనిఖీ చేశారు. డాక్టర్ విజయ్‌కుమార్, బస్తీ దవాఖాన డాక్టర్ సుధీర్, హెచ్‌ఈ కేవీ రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, సీసీ అనిల్, ఫార్మసిస్టు రామారావు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.