
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వం పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని, ఈ నెల 2,3,4 తేదీల్లో ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలలు బంద్ చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మాదరపు నాగరాజు, ఉపాధ్యక్షుడు బోనగిరి మధు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో మంగళవారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో వాల్‌పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ.7,200 కోట్ల స్కాలర్‌షిప్‌లు, రీయింబర్స్‌మెంట్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారన్నారు. స్కాలర్‌షిప్‌లు విడుదల చేయకపోతే పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, నాయకులు డాక్టర్ డోలి సత్యనారాయణ, బిక్కి వెంకటేశ్వర్లు, పుల్లారావు, లక్‌పతి, మల్లేష్, రవీందర్, పీడీఎస్‌యూ నాయకులు మహేష్, దిలీప్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ డీడబ్ల్యూఓగా శిరీష
మహబూబాబాద్: జిల్లా డీడబ్ల్యూఓగా పని చేసిన ధనమ్మ గత నెల 30న ఉద్యోగ విరమణ పొందారు. కాగా మానుకోట సీడీపీఓగా పని చేస్తున్న శిరీషకు జిల్లా ఇన్‌చార్జ్ డీడబ్ల్యూఓ బాధ్యతలు అప్పగిస్తూ ఆశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మిబాయి ఉత్తర్వులు జారీ చేశారని అధికారులు తెలిపారు. కాగా శిరీష మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రోడ్ల నిర్మాణానికి మున్సిపాలిటీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్ల ఎస్‌డీఎఫ్ నిధులు మంజూరు కాగా మంగళవారం మున్సిపల్ కమిషనర్ నిరంజన్, ఏఈ శృతి రాజుతండాలో పర్యటించి రోడ్ల నిర్మాణం కోసం కొలతలతో ప్రదిపాదనలు సిద్ధం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుమేర్‌చంద్‌జైన్, మాదా శ్రీనివాస్, తారాచంద్, అశ్వక్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యాన పంటల సాగుతో
అభివృద్ధి
గూడూరు: వరికి ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక రాబడితో పాటు అభివృద్ధి సాధించవచ్చని ఉద్యాన అధికారి శాంతిప్రియదర్శిని అన్నారు. మండలంలోని తీగలవేణిలో మంగళవారం ఉద్యాన పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉద్యాన పంటల సాగును పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలను అందిస్తుందన్నారు. పండ్ల తోటలతో పాటు పందిరి సాగు కూరగాయలు, ఆయిల్‌పామ్ సాగు కోసం ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఆయిల్‌పామ్ సాగుతో రైతుకు మంచి ఆదాయం వస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఏఓ అబ్దుల్‌మాలిక్, ఆయిల్‌ఫెడ్ ఫీల్డ్ అధికారి శ్రీకాంత్, అశోక్, మహేంద్ర, ఏఈఓ మధు, రైతులు పాల్గొన్నారు.
నోటీస్‌లు జారీ
కేసముద్రం: మున్సిపాలిటీ పరిధిలో చేపట్టే రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పలు దుకాణాదారులు, ఇంటి యజమానులకు మంగళవారం మున్సిపల్ అధికారులు నోటీస్‌లు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీస్‌లు అందజేసినట్లు వార్డు ఆఫీసర్ ప్రభాకర్ తెలిపారు. మొత్తంగా 51 మందికి నోటీసులు జారీ చేయగా, మిగిలిన వారికి కూడా నోటీస్‌లను అందించనున్నట్లు ఆయన తెలిపారు. వారం రోజుల్లో ఇచ్చిన నోటీస్‌లకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
మానుకోటలోనే శిక్షణ
తరగతులు నిర్వహించాలి
మహబూబాబాద్ అర్బన్: గిరిజన ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులకు జిల్లా కేంద్రంలోనే శిక్షణ తరగతులు నిర్వహించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేశ్ అన్నారు. ఈనెల 3,4 తేదీల్లో ఎస్‌ఎస్‌తాడ్వాయిలో కాకుండా జిల్లా కేంద్రంలోనే శిక్షణ తరగతులు నిర్వహించాలని కోరారు. గిరిజనశాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లా అధికారి దేశీరాం నాయక్‌కు టీపీటీఎఫ్ నాయకులు వినతిపత్రం ఇచ్చారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి