
పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తాం
డోర్నకల్: ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. మండలంలోని వెన్నారం, సీరోలు మండలంలోని మన్నెగూడెం ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం సకల సదుపాయాలు కల్ప స్తామని తెలిపారు. డీఈఓ రవీందర్‌రెడ్డి, డోర్నకల్, సీరోలు ఎంఈఓలు లక్ష్మానాయక్, లచ్చిరాం, హెచ్‌ఎంలు రమేశ్, ఇందిరారాణి ఉన్నారు.
ఆయిల్‌పామ్ సాగుతో అధిక ఆదాయం..
కురవి: ఆయిల్‌పామ్ సాగుతో అధిక ఆదాయం పొందవచ్చని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నా రు. మంగళవారం మండలంలోని బలపాల గ్రామ ంలో జిల్లా ఉద్యాన పట్టుపరిశ్రమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ మెగామేళాలో కలెక్టర్ పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో రైతులు ఉమాపిచ్చిరెడ్డి, రమేశ్, హనుమంతరావు, చంద్రారెడ్డి, సహాయ సంచాలకుడు ఎ.శ్రీనివాస్, ఏఓ నరసింహరావు, ఉద్యాన అధికారి ఆర్.శాంతిప్రియ, ఏఈఓ లయ, టీజీ ఆయిల్‌ఫెడ్ క్షేత్ర సిబ్బంది నాగరాజు, జి.చంద్రప్రకాశ్, కార్యాలయ సూపరింటెండెంట్ ఆర్.శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి హరి, బిందుసేద్య ప్రతినిధి కె.శంకర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ బలపాల పీహెచ్‌సీని సందర్శించారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్