
6న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాక
కేసముద్రం: మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈనెల 6న రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో బహిరంగసభ కోసం స్థలాన్ని ఆర్డీఓ కృష్ణవేణి, డీఎస్పీ తిరుపతిరావు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి పరిశీలించారు. తహసీల్దార్ వివేక్, రూరల్ సీఐ సర్వయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్‌రావు, సతీష్, దస్రూనాయక్, వెంకన్న, వేముల శ్రీనివా స్‌రెడ్డి, కదిర సురేందర్, రావుల మురళి, వసంతరావు, బానోత్ వెంకన్న పాల్గొన్నారు.