
విత్తనాలు విత్తేందుకు అనుకూలం
ఇటీవల కురిసిన వర్షాలతో విత్తనాలు మొలకెత్తేందుకు అనుకూలమైన పదును వచ్చింది. ఈనెల15 వరకు పత్తి, మొక్కజొన్న, మెట్ట భూముల్లో పునాస పంటలు వేసుకోవచ్చు. వరిలో 150 రోజుల పంట కాలం రకాలు కాకుండా 120 రోజుల పంట కాలం రకాలు నారు పోసుకోవాలి. ఇందులో కూనారం 1638, 733, 118, వరంగల్ రకం 962, 915, జగిత్యాల రకం(జేజీఎల్)24423, ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనా, 21278 రకాలను నారుపోసుకుంటే ఉపయోగంగా ఉంటుంది. ప్రభుత్వం అందించే బోనస్ కూడా వస్తుంది.
– క్రాంతి కుమార్, వ్యవసాయ శాస్త్రవేత్త, కేవీకే మల్యాల
●