
మొక్కలకు జీవం!
జిల్లాలో వర్షపాతం
వివరాలు (మిల్లీ మీటర్లలో)
మండంల వర్షపాతం
గార్ల 87.8
కేసముద్రం 68
బయ్యారం 64.8
గూడూరు 62.8
మహబూబాబాద్ 52
కురవి 50.8
దంతాలపల్లి 11.4
పెద్దవంగర 12.4
తొర్రూరు 16.4
నర్సింహులపేట 18.4
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు నాటిన పత్తి, మొక్కజొన్న విత్తనాల్లో కొన్ని మొలకెత్తగా, సరిగ్గా పదును లేక మరికొన్ని చోట్ల మొలకెత్తలేదు. మొలకెత్తిన మొక్కలకు నీరు లేక వాడిపోతున్న తరుణంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలు జీవం పోశాయి. ప్రస్తుతం విత్తనాలు నాటేందుకు అనుకూలమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పడంతో రైతులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు.
82,120 ఎకరాల్లో సాగు..
వానాకాలం సీజన్‌లో 4,29,790ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 2,19,143 ఎకరాల్లో వరి, 84,854 ఎకరాల్లో పత్తి, 58,361 ఎకరాల్లో మొక్కజొన్న, 52,249 ఎకరాల్లో మిర్చి సాగు చేసే అవకాశం ఉందని అధికారులు పంట ప్రణాళికలో పేర్కొన్నారు. ఇందులో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ పంటలు 82,120 ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో అత్యధికంగా 54,348 ఎకరాల్లో పత్తి, 16,043 ఎకరాల్లో మొక్కజొన్న, 9,996 ఎకరాల్లో జీలుగ,641 ఎ కరాల్లో పెసర,437ఎకరాల్లో జనుముతోపాటు కొద్ది పాటి ఎకరాల్లో పసుపు, కంది పంటలు సాగు చేశా రు. ఈవర్షంతో జూలై 5వరకు పత్తి గింజలు వేసే అ వకాశం ఉండడంతో మిగిలిన విస్తీర్ణంలో పత్తి గింజ లు పెడుతున్నారు.530ఎకరాల్లో వరి నాట్లు వేశారు.
జిల్లా వ్యాప్తంగా జల్లులు
జిల్లా వ్యాప్తంగా చిరు జల్లులు కురిశాయి. జిల్లాలో మొత్తం 631 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. 16 మండలాల్లో సగటున 39.5 మిల్లీ మీటర్లు నమోదైంది. అత్యధికంగా గార్ల మండలంలో 87.8 మిల్లీమీటర్లు, అత్యల్పంగా దంతాలపల్లి 11.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఈ వర్షపాతం స్వల్పమే అని.. మోస్తరు నుంచి భారీ వర్షం కురిసి చెరువులు నిండితేనే పంటలకు భరోసా వస్తుందని రైతులు చెబుతున్నారు. భారీ వర్షం కురిస్తే రైతులకు సాగునీటిపై రందీ ఉండదని అంటున్నారు.
వర్షాలతో ప్రాణం పోసుకున్న పత్తి, మొక్కజొన్న పంటలు
ఈనెల 15 వరకు విత్తనాలు
నాటేందుకు అనుకూలం
వరిలో స్వల్పకాలిక వంగడాల
నారు పోసేందుకు సిద్ధం
జిల్లా వ్యాప్తంగా కురిసిన వానలతో
అన్నదాతల్లో ఆనందం