
బాలుడిపై వీధి కుక్కల దాడి
గూడూరు: మండల కేంద్రంలోని లక్ష్మీనా రాయణస్వామి దేవాలయ సమీప ఓ వీధిలో ఆడుకుంటున్న బాలుడిపై కు క్కలు దాడికి పాల్ప డిన సంఘటన బుధవారం జరిగింది. బాలుడు అమ్మ మ్మ గారి ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో వచ్చిన మూడు కుక్కలు ఒక్కసారిగా బాలుడిని కరుస్తూ గీరడం మొదలు పెట్టా యి. దీంతో ఆ బాలుడి అరుపులకు కుటుంబ సభ్యులు రాగా కుక్కలు పరారయ్యాయి. గాయపడిన బాలుడిని వెంటనే స్థానిక సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. పట్టణ కేంద్రంలో కుక్కల బెడద ఎక్కువైందని, చిన్నారులు, వృద్ధులు బయట తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయని, కుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.