నేడు బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

నేడు బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం ఎంపికలు

Jun 28 2025 6:03 AM | Updated on Jun 28 2025 6:03 AM

నేడు

నేడు బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం ఎంపికలు

మహబూబాబాద్‌ అర్బన్‌: కలెక్టరేట్‌లోని ఐడీఓసీ కార్యాలయంలో శనివారం ఉదయం 9 గంటలకు 2025–26 విద్యా సంవత్సరానికి గిరిజ న విద్యార్థుల బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం ఎంపికలు లాటరీ పద్ధతిలో నిర్వహించనున్నట్లు జిల్లా గిరిజన శాఖ అధికారి గుగులోతు దేశీరాం నాయక్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కీంకు దరఖాస్తు చేసుకున్న గిరిజన విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.

‘పది’ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

మహబూబాబాద్‌ అర్బన్‌: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయని డీఈఓ రవీందర్‌ రెడ్డి తెలిపారు. జిల్లాలో 57 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 54 మంది ఉత్తీర్ణులయ్యారని, 94.74శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు. రికౌంటింగ్‌ పెట్టాలనుకునే విద్యార్థులు ఎస్‌బీఐ బ్యాంకులో రూ.500 చలాన్‌ చెల్లించి, ప్రధానోపాధ్యాయుడి సంతకంతో జూలై 7వ తేదీలోపు డైరెక్టర్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ హైదరాబాద్‌కు పంపించాలన్నారు. అలాగే రీ వెరిఫికేషన్‌ కోసం రూ.1000 చలాన్‌ చెల్లించి విద్యాశాఖ కార్యాలయంలోని ఎగ్జామినేషన్‌ సెక్షన్‌లో జూలై 7లోపు అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు ఏసీజీఈ మందుల శ్రీరాములు 98497 61012 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలన్నారు.

విద్యుత్‌శాఖ ఎస్‌ఈగా విజయేందర్‌రెడ్డి

నెహ్రూసెంటర్‌/తొర్రూరు: మహబూబాబాద్‌ జిల్లా విద్యుత్‌శాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ)గా పి.విజయేందర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా విద్యుత్‌శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈగా శ్రీనివాసాచారి కొద్దిరోజులు బాధ్యతలు చేపట్టగా.. పూర్తిస్థాయి ఎస్‌ఈగా పి.విజయేందర్‌రెడ్డి జిల్లాకు వచ్చారు. మహబూబాబాద్‌ జిల్లా నుంచి డివిజన్‌ ఇంజనీర్‌ టెక్నికల్‌గా విధులు నిర్వహిస్తున్న పెద్ది రాజం వరంగల్‌కు, తొర్రూరు డీఈ మధుసూదన్‌ మెట్‌పల్లికి బదిలీ అయ్యారు. కాగా పెద్దపల్లి డీఈ రవి తొర్రూరు డీఈగా బదిలీపై రానున్నారు. కాగా మహబూబాబాద్‌ డీఈటీ, తొర్రూరు డీఈ బాధ్యతలను ఇన్‌చార్జ్‌లకు అప్పగించారు.

రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా వెంకన్ననాయక్‌

నెహ్రూసెంటర్‌: సేవాలాల్‌ సేన రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా జిల్లాకు చెందిన వెంకన్ననాయక్‌ను నియమించినట్లు సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్య సంజీవ్‌నాయక్‌ శుక్రవారం తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన సంఘం రాష్ట్ర సమావేశంలో ఎన్నుకున్నారని, సంఘం బలోపేతం, గిరిజనుల హక్కుల సాధనకు పోరాటాలు నిర్వహిస్తానని వెంకన్ననాయక్‌ తెలిపారు. తన నియామకానికి కృషి చేసిన సంఘం జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

వర్సిటీ అధికారుల నిర్లక్ష్యంపై

లోకాయుక్తలో ఫిర్యాదు

ఎంజీఎం: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేట్‌, డీమ్డ్‌ యూనివర్సిటీలకు మేలు చేయాలనే ఒప్పందం, నష్టపోయిన అర్హులైన 400 మెడికల్‌ విద్యార్థులకు న్యాయం జరగాలని, అవినీతి అధికారులపై విచారణ చేపట్టాలని కోరుతూ వినియోగదారుల మండలి రాష్ట్ర కమిటీ లోకాయుక్తలో ఫిర్యాదు చేసింది. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు డీమ్డ్‌ యూనివర్సిటీలుగా మారడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు తప్పనిసరి. అయితే తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేకున్నా.. 400 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్న రెండు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు డీమ్డ్‌ యూనివర్సిటీలుగా మారడం, ఈక్రమంలో గతేడాది అర్హులైన 400 మెడికల్‌ సీట్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుంచి దాటిపోవడంపై జరిగిన అవినీతిపై విచారణ కోసం లోకాయుక్తలో ఫిర్యాదు దాఖలు చేసినట్లు వినియోగదారుల మండలి ప్రతినిధులు సాంబరాజు చక్రపాణి, మొగిలిచర్ల సుదర్శన్‌ తెలిపారు.

నేడు బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం ఎంపికలు
1
1/1

నేడు బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం ఎంపికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement