
లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలి
మహబూబాబాద్: జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ సంబంధిత అఽధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. మంజూరు, గ్రౌండింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, హౌసింగ్ డీఈ రాజయ్య, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలి..
ప్రతీ గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్–2025లో జిల్లాను ముందంజలో ఉంచాలన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి పాల్గొన్నారు.
పటిష్ట చర్యలు తీసుకోవాలి..
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని లెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని వీసీ సమావేశ మందిరంలో రోడ్డు ప్రమదాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జంక్షన్‌ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి, డీఎస్పీ తిరుపతి రావు, ఆర్‌అండ్‌బీ ఈఈ బీమ్లా పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్