
మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని వేమునూరు ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలోని వాటర్ ట్యాంక్‌కు ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీతో ప్రతీరోజు తాగునీరు వృథాగా పోతోంది. చాలారోజుల నుంచి పైపులైన్ లీకేజీ అవుతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదు. ఈక్రమంలో ట్యాంకు పిల్లర్ల ప్రాంతంలో నీళ్లు నిలిచి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడే మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉండడంతో విద్యార్థులు అటువైపుగా వెళ్లి లీకేజీ నీళ్లలో జారిపడిన ఘటనలు ఉన్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. లీకేజీ కారణంగా ఆ ప్రాంతమంతా బురదమయంగా మారి అధ్వానంగా కనిపిస్తోంది. కాగా, మిషన్ భగీరథ అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ