
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి
నెహ్రూసెంటర్: రానున్న మున్సిపాలిటీ, సర్పంచ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ సత్తా చాటాలని, అధిక స్థానాలను కై వసం చేసుకోవాలని ఆపార్టీ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ సమావేశం జిల్లా కేంద్రంలోని ధర్మన్న కాలనీలో శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందేళ్ల చరిత్ర కలిగిన సీపీఐని స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మున్సి పల్ మాజీ ఫ్లోర్‌లీడర్ అజయ్‌సారథి, పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, శ్రావణ్, తోట రాజ కుమారి, మంద శంకర్, మాలోత్ రవీందర్, ఆబో తు అశోక్, మంచినీళ్ల రాకేశ్, తండ శ్రీనాథ్, మాధ వి, అలీమా తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి