పెండింగ్‌ వేతనాలు విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ వేతనాలు విడుదల చేయాలి

Jun 27 2025 12:32 PM | Updated on Jun 27 2025 12:32 PM

పెండి

పెండింగ్‌ వేతనాలు విడుదల చేయాలి

మహబూబాబాద్‌: గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్‌ వేతనాలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రవి డిమాండ్‌ చేశారు. యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం డీపీఓ కార్యాలయంలో డీపీఓ హరిప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా రవి మాట్లాడుతూ.. మూడు నెలల వేతనాలు పెండింగ్‌ ఉండడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వాప్తంగా 60,000మంది కార్మికులు ఉన్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రతీనెల ఒకటో తేదీన వేతనాలు ఇవ్వాలన్నారు. జీఓ 54ను రద్దు చేసి అందరిని రెగ్యులర్‌ చేయాలన్నారు. కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్యక్రమంలో శ్రీకాంత్‌, పరుషరాములు, సర్సయ్య, బీకు తదితరులు పాల్గొన్నారు.

బాధ్యతలు స్వీకరించిన

మున్సిపల్‌ కమిషనర్‌

డోర్నకల్‌: డోర్నకల్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా బి.నిరంజన్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మున్సిపల్‌ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

తొర్రూరు కమిషనర్‌..

తొర్రూరు: తొర్రూ రు మున్సిపల్‌ కమిషనర్‌గా నియమితులైన వక్కాల శ్యాంసుందర్‌ గురువారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

ఉద్యోగులకు

వేతనాలు చెల్లించాలి

నెహ్రూసెంటర్‌: ఎన్‌హెచ్‌ఎం పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులకు నెలనెలా వేతనాలు చెల్లించాలని తెలంగాణ ఎన్‌హెచ్‌ఎం ఎంప్లాయీస్‌ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ కరుణాకర్‌ బుధవారం డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలీ చాలని వేతనాలతో పని చేస్తున్న ఉద్యోగులకు ఇంక్రిమెంట్‌, పదోన్నతి, ఉద్యగ భద్రత కల్పించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న రెండు నెలల జీతాలు అందజేయాలన్నారు.

రాష్ట్ర బృందం సందర్శన

నెహ్రూసెంటర్‌: మహబూబాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని మెడికల్‌ కళాశాల మానిటరింగ్‌ బృందం గురువారం సందర్శించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల పరిశీలనలో భాగంగా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఫణింద్రారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో, ఓయూ ప్రిన్సిపాల్‌ రాజారావు ప్రభు త్వ మెడికల్‌ కళాశాల, జీజీహెచ్‌లోని మౌలిక వసతులు, బిల్డింగ్‌, తరగతి గదులు, అన్ని విభాగాలను పరిశీలించారు. మెడికల్‌ విద్యార్థులు, రోగులకు అందుతున్న సేవలు, సౌకర్యాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జీఎంసీ, జీజీహెచ్‌పై ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నట్లు వారు పేర్కొన్నారు.

రేపు బెస్ట్‌ అవైలబుల్‌

స్కీం ఎంపికలు

మహబూబాబాద్‌ అర్బన్‌: ఈ నెల 28వ తేదీ ఉదయం 11గంటలకు 2025–26 విద్యా సంవత్సరానికి గిరిజన విద్యార్థుల బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం ఎంపికలు లాటరీ పద్ధతిలో ములుగు జిల్లా ఏటూరునాగరం ఐటీడీఓ ఐడీఓసీ కార్యాలయంలో జరుగుతాయని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా గురువారం పేర్కొన్నారు. మానుకోట జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న గిరిజన వి ద్యార్థులు, తల్లిదండ్రులు ఎంపికలకు హాజరుకావాలని సూచించారు.

పెండింగ్‌ వేతనాలు  విడుదల చేయాలి1
1/2

పెండింగ్‌ వేతనాలు విడుదల చేయాలి

పెండింగ్‌ వేతనాలు  విడుదల చేయాలి2
2/2

పెండింగ్‌ వేతనాలు విడుదల చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement