
సర్వే ప్రకారం పాస్‌పుస్తకాలు అందించాలి
కేసముద్రం: ఎంజాయ్‌మెంట్ సర్వే ప్రకారం తమ భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించాలని గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నారాయణపురం గ్రామ రైతులు వంటావార్పు కార్యక్రమం చేపట్టి, ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ దారావత్ రవి, పలువురు రైతులు మాట్లాడుతూ... 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 1,827 ఎకరాల పట్టా భూములను 2017లో గత ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఫారెస్టు భూములుగా పేర్కొంటూ పట్టాలను రద్దు చేసిందన్నారు. అప్పటి నుంచి తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జీఓ 94 జారీ చేసి, రైతు పేరు, తండ్రి పేరు కు బదులు వస్తున్న అడవి అనే పదాన్ని తొలగించిందన్నారు. అధికారుల బృందం ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహించి ఆరునెలలు కావొస్తున్నా పాస్ పుస్తకాలు జారీ చేయలేదన్నారు. సుమారు 600మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు లేకపోవడంతో నష్టపోవాల్సి వస్తుందని, ఇప్పటికై నా అధికారులు స్పందించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్ ఎదుట వంటావార్పు చేసి రైతులంతా సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం తహసీల్దార్ వివేక్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతులు వెంకన్న, బాషా, వెంకట్‌రెడ్డి, విష్ణురెడ్డి, రవి, రాములు, యాకూబ్‌రెడ్డి, యాకూబ్, లక్‌పతి, దేవా, సరిత, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
తహసీల్ ఎదుట నారాయణపురం
రైతుల వంటావార్పు