
కేయూ వీసీని కలిసిన రీసెర్చ్ ప్రాజెక్ట్ సభ్యులు
కేయూ క్యాంపస్: రుసా 2.0 ప్రాజెక్ట్ కింద మంజూరైన శ్రీసెంటర్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ మెటీరియల్స్‌శ్రీ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఫెల్లోస్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకట్రామ్‌రెడ్డితో కలిసి మంగళవారం కేయూ వైస్ చాన్స్‌లర్ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రంలను మర్యాద పూర్వకంగా కలిశారు. రుసా 2.0లో భాగంగా ఐదు కేంద్రాల్లో ఒకటిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సెంటర్‌లో అధిక ప్రభావం చూపే మంచి జర్నల్స్‌లో మెరుగైన ఫలితాలను ప్రచురించడానికి, నాణ్యమైన పరిశోధన నిర్వహించాలని వీసీ ప్రతాప్‌రెడ్డి.. ప్రాజెక్ట్ ఫెల్లోలకు సూచించారు. కార్యక్రమంలో శ్రీలత, అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ పద్మజ, విభాగాధిపతి మంజుల, నరేందర్, రాజు, శ్రీలత, నర్సింహులు పాల్గొన్నారు.