
కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి
● డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్
నెహ్రూసెంటర్: కంటి ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్ అన్నారు. మంగళవారం జిలా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆప్తాలమిక్ ఆఫీ సర్స్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల పిల్లల్లో కంటి సంబంధించి లోపాలను గుర్తించి, వరంగల్‌కు చికిత్స నిమి త్తం పంపించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్స్ లక్ష్మీనారాయణ, ఆప్తాలమిక్ ఆఫీసర్స్ సుబ్బలక్ష్మి, జోత్స్న, రాజ్‌కుమార్, కృష్ణ, డెమో ప్రసాద్, కేవీ రాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
టూర్ ప్యాకేజీలను వినియోగించుకోవాలి
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
మహబూబాబాద్: ఆర్టీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రయాణికులు వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆర్టీసీ మహబూబాబాద్ డిపో ఆధ్వర్య ంలో ప్రత్యేక టూర్ ప్యాకేజీల పోస్టర్లను ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27న రాత్రి 11 గంటలకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు ఆర్టీసీ స్పెషల్ టూర్ ఉందని, ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సీసీఎల్ కమిషనర్‌ను
కలిసిన ఎమ్మెల్యే
కేసముద్రం: మండలంలోని నారాయణపురం గ్రామ రైతుల భూ సమస్యను పరిష్కరించాల ని హైదరాబాద్‌లోని సచివాలయంలో సీసీఎల్ కమిషనర్‌ను మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ మంగళవారం కలిశారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ కారణంగా ఆన్‌లైన్‌లో వందల మంది రైతుల పట్టాభూములు అటవీ భూములుగా చూపించడం వల్ల ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారన్నారు. తక్షణమే భూరికార్డులను సరిచేసి నారాయణపురం రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఇందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
స్పోర్ట్స్ స్కూల్స్‌తో
విద్యార్థులకు భవిష్యత్
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులు దేశానికి ప్రాతినిధ్యం వహించేలా స్పోర్ట్స్ స్కూల్స్ తీ ర్చిదిద్దుతాయన్నాని జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి ఓలేటి జ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి క్రీడా పాఠశాలలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. మానుకోట జిల్లా క్రీడలకు పు ట్టినిల్లు లాంటిందని, ఇక్కడి నుంచి చాలామంది పలు క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. సుమారు 100మంది బాలబాలికలకు ఎంపికలకు హాజరయ్యారు. కార్యక్రమంలో పీడీలు, పీఈటీలు శంకర్‌నాయక్, చంప్లనాయక్, వెంకటేశ్వర్లు, విజయ్‌చందర్, సునీల్, వీరభద్రం, రాజకుమారి, కాశీనాథ్, శ్రీనివాస్, కమల్‌కిశోర్, కుమారస్వామి, వి ద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి

కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి