వామ్మో చిరుతలు
డోన్ టౌన్: చనుగొండ్ల గ్రామ సమీపంలో రెండు చిరుత పులులు వాటి పిల్లలతో సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కొద్ది రోజులుగా చిరుత పులులు గ్రామస్తులకు కనిపించడంతో పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నా రు. ఈ క్రమంలో సోమవారం గేదె దూడ, మంగళవారం కూడా మరో రైతుకు చెందిన ఆవు దూడపై దాడి చేసి చంపేసినట్లు గ్రామస్తులు గుర్తించారు. విషయం తెలుసుకున్న డోన్ అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అఫీసర్ రవీంద్రనాయక్, బీట్ అఫీసర్ భారతి గ్రామానికి వెళ్లి చిరుతలు సంచరిస్తున్న కొండల్లో తిరిగి వాటి ఆనవాళ్లు గురించారు. మృతి చెందిన బర్రె దూడ కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం గ్రామస్తులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
కొండపైన ఉన్న చిరుత పులి


