జాతీయ సైన్స్ ఫెస్టివల్‌కు ఎంపిక
బనగానపల్లె : మండలంలోని నందవరం జెడ్పీ ఉన్నత పాఠశా ల ఉపాధ్యాయుడు వీరబోయిన కుమార్‌బాబు ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్‌ఎఫ్)–2025కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని మంగళవారం ఉపాధ్యాయుడు కుమార్‌బాబు తెలిపారు. రాయలసీమ రీజియన్ పర్యావరణ సమన్వయకర్తగా, రాష్ట్ర కౌశల్ కో–ఆర్డినేటర్‌గా జిల్లా సైన్స్ ఆఫీసర్‌గా పని చేయడంతో పాటు సామన్య ప్రజలు, విద్యార్థులకు శాసీ్త్రయ విజ్ఞానాన్ని చేరువ చేయడంలో చేసిన కృషికి గాను తనకు ఈ గుర్తింపు లభించిందన్నారు. ఈ నెల 5 నుంచి 9వ తేది వరకు కేంద్ర సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో చండీగఢ్‌లో ఐఐఎస్‌ఎఫ్ జరుగుతుందని వెల్లడించారు.
బేతంచెర్ల ఏరియా హాస్పిటల్ ఏడీగా మాధవి
కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖ బేతంచెర్ల ఏరియా హాస్పిటల్ సహాయ సంచాలకులుగా డాక్టర్ జి.మాధవి నియమితులయ్యారు. ఈమె డిప్యుటేషన్‌పై డోన్ నియోజకవర్గం కొమ్మెమర్రిలోని అనిమల్ హజ్బెండరీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్స్‌పల్‌గా ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. డిప్యుటేషన్ గడువు ముగియడంతో డిపార్టు మెంటులో రిపోర్టు చేసుకున్నారు. బేతంచెర్ల ఏరియా హాస్పిటల్ ఏడీ పోస్టు ఖాలీగా ఉండటంతో ఈ పోస్టులో నియమిస్తూ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్‌నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతవరకు ఈ పోస్టులో ఉన్న వసంతలక్ష్మి పదోన్నతిపై కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ నియమితులైన విషయం తెలిసిందే.
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు
93 శాతం హాజరు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ ఐదో సెమిస్టర్ పరీక్షల్లో 93 శాతం హాజరు నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా మంగళవారం 6,8628 మందికి 6,365 మంది హాజరు కాగా 497 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
ఏపీసీఎస్‌ఏ అసోసియేట్ అధ్యక్షుడిగా నాగరమణయ్య
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ కో–ఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర సహా అధ్యక్షుడి (అసోసియేట్ ప్రెసిడెంటు)గా కర్నూలు సబ్ డివిజన్ అసిస్టెంటు రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న టి.నాగరమణయ్య నియమితులయ్యారు. ఈ నెల 1వ తేదీన విజయవాడలో రాష్ట్ర సంఘం ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి కర్నూలు నుంచి ఈయనకు రాష్ట్ర కార్యవర్గంలో కీలకమైన స్థానం లభించింది. ఈయన జిల్లా కో–ఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇటీవలనే ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర సంఘంలో అసోసియేట్ ప్రెసిడెంటుగా ఎన్నిక కావడం పట్ల హర్షం ప్రకటించారు. సహకార ఉద్యోగు లు ఎదుర్కొంటున్న సర్వీస్ సమస్యలు, పదోన్నతులు తదితర వాటిని సత్వరం పరిష్కరించే అవకాశం లభించిందని తెలిపారు. రాష్ట్ర ఆసోసియేట్ ప్రసిడెంట్‌గా ఎన్నికై న నాగరమణయ్యను సహకార శాఖ అధికారులు, ఉద్యోగులు సత్కరించి అభినందించారు.
జాతీయ సైన్స్ ఫెస్టివల్‌కు ఎంపిక


