టిప్పర్ కింద పడి ఇరువురి మృతి
కర్నూలు: కర్నూలు శివారులోని లోకాయుక్త కార్యాలయం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గూడూరు పట్టణానికి చెందిన చంద్రబాబు అలియాస్ చంద్రమోహన్(30), సుమన్(28) అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలకు గురైన సమీప బంధువు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన నవీన్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నవీన్ ఎమ్మిగనూరు నుంచి మూడు రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై గూడూరుకు వచ్చాడు. మంగళవారం ఉదయం చంద్రమోహన్‌తో కలసి ద్విచక్ర వాహనంపై కర్నూలుకు వచ్చారు. అమీలియో హాస్పిటల్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ కర్నూలు ఇందిరాగాంధీ నగర్‌లో ఉంటున్న సుమన్‌తో కలసి అలంపూరుకు వెళ్లి విందు చేసుకుని ముగ్గురూ కలసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. లోకాయుక్త కార్యాలయం సమీపంలో ముందు వెళ్తున్న టిప్పర్‌ను ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో అదుపు తప్పి కింద పడ్డారు. దీంతో టిప్పర్ వారిపై వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలిసిన వెంటనే కర్నూలు ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. గాయాలకు గురైన నవీన్‌ను ఆసుపత్రికి తరలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. విషయం తెలిసిన వెంటనే మృతిచెందిన వారి బంధువులు ఆసుపత్రి మార్చురీ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. సుమన్ వాహనాన్ని నడుపగా చంద్రమోహన్, నవీన్‌లు వెనుక కూర్చున్నారు. హెల్మెట్ ధరించి వుంటే ప్రమాద తీవ్రత తగ్గి ఉండేదని పోలీసులు భావిస్తున్నారు.
టిప్పర్ కింద పడి ఇరువురి మృతి
టిప్పర్ కింద పడి ఇరువురి మృతి
టిప్పర్ కింద పడి ఇరువురి మృతి


