
గోదాముగా అంగన్‌వాడీ కేంద్రం
రుద్రవరం మండలం డి.కొట్టాల గ్రామంలోని ఈ భవనం.. గోదాము అనుకుంటే పొరపాటే. చిన్నారుల కోసం నూతనంగా నిర్మిస్తున్న అంగన్‌వాడీ కేంద్రం అది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు కింద మొదటి విడతగా శ్రీరంగాపురం, డి.కొట్టాల, ముత్తలూరు, నర్సాపురం, పేరూరు, కొండమాయపల్లె గ్రామాలకు అంగన్‌వాడీ కేంద్రాలు మంజూరు చేసి, ఒక్కో భవన నిర్మాణానికి రూ.10 లక్షల చొప్పున విడుదల చేసింది. కాంట్రాక్టర్లు నిర్మాణాలు చేపట్టారు. భవనాలు వివిధ దశల్లో ఉండగా ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా పైసా నిధులు విదిల్చకపోవడంతో భవన నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. చిన్నారులకు ఉపయోగపడాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలు ఇలా నిరుపయోగంగా మారడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – రుద్రవరం

గోదాముగా అంగన్‌వాడీ కేంద్రం