
స్పెల్‌బీ పరీక్ష రాస్తున్న విద్యార్థులు
కర్నూలు కల్చరల్: విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సాక్షి మీడియా కృషిచేస్తోంది. డ్యూక్స్ వ్యాఫీ ప్రధాన స్పాన్సర్‌గా, ట్రిప్స్ ఇంటర్నేషనల్ (రాజమండ్రి) స్కూల్ వారు అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న స్పెల్ బీ, మ్యాథ్స్ బీ పోటీలను సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలు అబ్బాస్ నగర్‌లోని రవీంద్ర స్కూల్‌లో నిర్వహించారు. పోటీలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. స్పెల్‌బీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు ఇంగ్లీషు భాషపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకున్నారు. మ్యాథ్స్‌బీ పరీక్షలతో గణితంలో మెలకువలను నేర్చుకున్నారు. వివిధ దేశాల్లో ఇలాంటి పోటీ పరీక్షలు జరుగుతున్నాయి. వీటి ముఖ్య ఉద్దేశం విద్యార్థిని పరిపూర్ణవంతుడిగా తీర్చిదిద్దడమే. అందులో భాగంగా ‘సాక్షి’ కూడా విద్యార్థుల్లో ఆంగ్ల పద సామర్థ్యాన్ని, గణిత పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఏటా ఈ పోటీలు నిర్వహిస్తుండటంతో మేథావులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.
స్పెల్‌బీ క్వార్టర్ ఫైనల్..
మ్యాథ్స్ బీ సెమీ ఫైనల్
స్పెల్‌బీ క్వార్టర్ ఫైనల్ పోటీలకు మొత్తం 108 మంది విద్యార్థులు హాజరయ్యారు. క్యాటగిరీ–1లో 18, క్యాటగిరీ–2లో 25, క్యాటగిరీ–3లో 44, క్యాటగిరీ–4లో 21 మంది వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. మ్యాథ్స్ బీ సెమీ ఫైనల్ పోటీలకు మొత్తం 26 మంది హాజరయ్యారు. క్యాటగిరీ–1లో 7, క్యాటగిరీ–2లో 8, క్యాటగిరీ–3లో 3, క్యాటగిరీ–4లో 8 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులు మొదటి క్యాటగిరీగా, మూడు, నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులను రెండో క్యాటగిరీగా, ఆరు, ఏడు తరగతుల విద్యార్థులను మూడో క్యాటగిరీగా, ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులను నాలుగో క్యాటగిరీలుగా విభజించి వారి తరగతి, స్థాయికి తగ్గట్టుగా ఇంగ్లీషు, గణిత సామర్థ్యాలను పరీక్షించారు.
విద్యార్థులకు ఆంగ్ల భాషపై పట్టు
సాక్షి మీడియా ఆధ్వర్యంలో నిర్వహణ


పరీక్ష కేంద్రానికి చేరుకుంటున్న విద్యార్థులు
