● ఇద్దరు అరెస్ట్
డోన్ టౌన్: స్థానిక భారత్ దాబా సమీపంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పట్టణ ఎస్‌ఐ శరత్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని కొత్తపేటకు చెందిన ఈడిగ ఈశ్వర్‌గౌడ్, చిగురమానుపేటకు చెందిన ఎరుకల రాములమ్మ ఇతరుల నుంచి గంజాయి కొనుగోలు చేసి స్థానికంగా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు దాడి చేసి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.