అల్లకల్లోలంగా హంసలదీవి సాగర తీరం
కోడూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దిత్వా’ తుపాను కారణంగా హంసలదీవి సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. రెండు రోజులుగా సాగరతీరంలో అలలు ఉధృతి ఎక్కువగానే ఉంది. అయితే ఆదివారం ఆ తీవ్రత మరింత పెరిగింది. సముద్ర అలలు సుమారు మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం నీరు కూడా ముందుకు చొచ్చుకొచ్చి డాల్ఫిన్ భవనం చుట్టూ చేరాయి. తీరంలోని ఇసుకతిన్నెలు సైతం భారీగా కోతకు గురయ్యాయి. సముద్ర పరిస్థితులు భిన్నంగా ఉండడంతో అటవీ, మైరెన్ పోలీసులు బీచ్‌లోకి పర్యాట కుల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. మరో రెండు రోజుల పాటు బీచ్ గేట్లు మూసే ఉంటాయని అటవీ అధికారులు తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్
పామర్రు: రాష్ట్రంలో నష్టపోయిన ధాన్యం రైతులకు తక్షణమే గిట్టుబాటు ధర కల్పించి ఆదు కోవాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు తమది రైతుల ప్రభుత్వమని రైతులకు అన్నీ బాగా చేస్తున్నామని, గత ప్రభుత్వంలోనే రైతులకు అన్యాయం జరిగిందనే చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఒక్కసారి టీడీపీ నేతలు క్షేత్రస్థాయికి వెళ్లి రైతుల పరిస్థితిని చూడాలని సూచించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి గిట్టు బాటు ధర కల్పించిందని గుర్తుచేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్కరైతు కూడా సాగులో పరుగు మందులు, ఎరువులు, యారియా దొరకలేదని రోడ్లు ఎక్కిన పరిస్థితి లేదని, టీడీపీ ప్రభుత్వంలో యూరియా దొరక్క రోడ్లెక్కి ధర్నాలు చేసిన పరిస్థితి చూస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధర, ఇన్‌పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్సు పాలసీలు ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. సాగుకు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తోందని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అల్లకల్లోలంగా హంసలదీవి సాగర తీరం


