వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుమలగిరి(జగ్గయ్యపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం వాల్మీకోద్భవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నాలుగు రోజుల పాటు జరగనున్న స్వామి వారి పవిత్రోత్సవాలు ఘనంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలుత వాస్తుపూజ, వాస్తు హోమం, రక్షా బంధనం, అంకురారోహణ వంటి కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకుడు తిరునగరి రామ కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద అంకురారోహణ నిర్వహించి పవిత్రోత్సవాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సాంబశివరావు, చైర్మన్ భరద్వాజ్, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: జాతీయ తైక్వాండో పోటీల్లో మండలంలోని జూపూడి గ్రామానికి చెందిన కలతోటి దామిని అత్యుత్తమ ప్రతిభ చాటి ఐదు పతకాలు సాధించింది. ఉత్తరప్రదేశ్‌లో నవంబర్ 21 నుంచి 23 వరకు జరిగిన తైక్వాండో పోటీలో వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో తలపడి రెండు బంగారు, రెండు రజత, ఒక కాంస్య పతకాన్ని గెలుసుకుంది. 55–59 కిలోల విభాగంలో ఆమె పాల్గొంది. ఉమ్మడి కృష్ణా జిల్లా కోచ్ అంకమ్మరావు తైక్వాండో అకాడమీలో శిక్షణ పొందిన దామిని గతంలో కూడా వివిధ ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పతకాలు సాధించింది. దామిని ప్రతిభకు పలువురు అభినందనలు తెలిపారు. గుణదల డాన్ బోస్కో పాఠశాలలో బాలిక 9వ తరగతి చదువుతోంది.
వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం


