12 నుంచి రాష్ట్ర స్థాయి యోగా పోటీలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అనంతపురంలో ఈ నెల 12, 13, 14 తేదీల్లో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ యోగా చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతాయని యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి రామ కృష్ణప్రసాద్ తెలిపారు. నగరంలోని యోగాసన స్పోర్ట్స్ అసోసయేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సబ్‌జూనియర్స్ యోగాసన చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇప్పటికే జిల్లా స్థాయి పోటీలు నిర్వహించామని, విజేతలు అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు ఈ నెల 28వ తేదీన మహారాష్ట్రలోని సంఘామూర్‌లో జరిగే జాతీయ స్థాయి యోగాసన పోటీలకు ఎంపికవుతారన్నారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం సంద ర్భంగా ఈ నెల 21వ తేదిన రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మెడిటేషన్ క్లాసులను నిర్వహిస్తున్నా మని గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ ఆంజనేయులు మాట్లాడుతూ.. మెడిటేషన్ క్లాసులకు తమ సంస్థ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. డాక్టర్ పావని ప్రియాంక, అమృత హస్తం చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి దారా కరుణశ్రీ,, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు రాధిక, సెక్రటరీ ప్రేమ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొంగర సాయి, సెక్రటరీ రాజేశ్వరి, ఆర్.చరణ్, శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగాసన పోటీల కరపత్రాలను ఆవిష్కరించారు.


