
పేకాట ‘డెన్’లు..
మొవ్వ మండలం కోసూరులో గ్రామ స్థాయి టీడీపీ నేత ఆధ్వర్యంలో పేకాట జరుగుతున్నట్లు తెలుస్తోంది. పెడన, పామర్రు నియోజకవర్గాల సరిహద్దు ప్రాంతంలోని ఓ తోటలో జరిగే పేకాటకు కాజ గ్రామానికి చెందిన టీడీపీ నేత నేతృత్వం వహిస్తున్నట్లు చెబుతున్నారు. పామర్రు మండలం కేదారేసుపల్లెలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువజన విభాగం కీలక నేత కనుసన్నల్లో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ శిబిరాలు పోలీసు కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే భావన ప్రజల్లో వ్యక్తం అవుతోంది. నియోజకవర్గంలోని ముఖ్యనేతకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఈ పేకాట నిర్వాహకులే అన్నీ తామై వ్యవహరించడం, నిర్వహణ మొత్తం ఖర్చులను భరించడం అక్కడ హాట్ టాపిక్‌గా మారింది,