బీభత్సం సృష్టించిన లారీ | - | Sakshi
Sakshi News home page

బీభత్సం సృష్టించిన లారీ

Jul 3 2025 7:31 AM | Updated on Jul 3 2025 7:31 AM

బీభత్

బీభత్సం సృష్టించిన లారీ

● ఆర్టీసీ బస్సును ఢీకొని దూసుకెళ్లిన లారీ ● డివైడర్‌ దాటి మరో లారీని ఢీకొన్న వైనం ● నుజ్జునుజ్జయిన రెండు లారీల క్యాబిన్లు ● క్యాబిన్లలో ఇరుక్కుపోయిన డ్రైవర్లు, క్లీనర్లు ● తీవ్ర గాయాలపాలైన డ్రైవర్లు, క్లీనర్లు

కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణలంక జాతీయ రహదారిపై సత్యంగారి హోటల్‌ జంక్షన్‌ వద్ద బుధవారం వేకువ జామున ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా ప్రయాణిస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొని ఆ తరువాత డివైడర్‌ను దాటి రెండో వైపు ప్రయాణిస్తున్న మరో లారీని ఎదురుగా బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు క్యాబిన్లలో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. వినుకొండకు చెందిన బొమ్మిడి నాగార్జున, తాడేపల్లిగూడెంనకు చెందిన ఆరిమెల్లి వెంకటేష్‌ లారీ డ్రైవర్‌లుగా జీవిస్తున్నారు. మంగళవారం రాత్రి నాగార్జున పది టైర్ల లారీలో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లోడ్‌చేసుకుని క్లీనర్‌ జి.వెంకటేశ్వర్లుతో కలిసి కాకినాడ నుంచి గొల్లపూడి బయలుదేరాడు. వెంకటేష్‌ మరో లారీలో స్టీల్‌ సామగ్రి లోడ్‌ చేసుకుని క్లీనర్‌ గల్ల వంశీకృష్ణతో కలిసి విజయవాడ నుంచి తణుకు బయలుదేరాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారు జాము ఆరుగంటల సమయంలో కృష్ణలంకలోని సత్యంగారి హోటల్‌ జంక్షన్‌ వద్దకు రాగానే సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లోడ్‌తో మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీ అదుపుతప్పి ముందు వైపు మంగళగిరి నుంచి బస్టాండ్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఆ తరువాత డివైడర్‌ పై నుంచి అవతలి వైపునకు దూసుకెళ్లి స్టీల్‌ సమగ్రితో తణుకు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. రెండు లారీల డ్రైవర్లు, క్లీనర్లు క్యాబిన్లలో ఇరుక్కుపోయారు. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఏం జరిగిందోనని ఘటనా స్థలానికి పరుగులు పెట్టారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులు, క్రేన్‌ సాయంతో డ్రైవర్లు, క్లీనర్లను బయటకు తీసి చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ప్రభుత్వా స్పత్రికి తరలించారు. లారీ ఢీకొనడంతో ఆర్టీసీ బస్సు వెనుక వైపు అద్దం పగిలిపోయింది. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్‌ సీఐ బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది హైవే మీద అడ్డంగా ఉన్న రెండు లారీలను క్రేన్‌ సాయంతో తొలగించారు. ఆర్టీసీ డ్రైవర్‌ ఎం.శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బీభత్సం సృష్టించిన లారీ 1
1/2

బీభత్సం సృష్టించిన లారీ

బీభత్సం సృష్టించిన లారీ 2
2/2

బీభత్సం సృష్టించిన లారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement