
కార్తికేయుని సేవలో ప్రముఖులు
మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పాండిచ్చేరి మాజీ మంత్రి, ఆ రాష్ట్ర ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, చైన్నె వాసి, టీటీడీ బోర్డు సభ్యుడు కృష్ణమూర్తి, అనురాధ దంపతులు గురువారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారికి దేవస్థానం ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, వేద పండితులు, అర్చక స్వాములు స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన వారు పుట్టలో పాలు పోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి కృష్ణమూర్తి, అనురాధ దంపతులు రూ.1,00,116 విరాళం సమర్పించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం, ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ స్వామివారి చిత్రపటం, లడ్డుప్రసాదాలను మల్లాడి కృష్ణారావు, కృష్ణమూర్తి, అనురాధకు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ ప్రధానార్చకుడు బుద్దు పవన్‌కుమార్ పూజలు చేశారు.
యోగాను ఒలింపిక్ క్రీడల్లో చేర్చాలి
చిలకలపూడి(మచిలీపట్నం): యోగాను ఒలింపిక్ క్రీడల్లో చేర్చాలని ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ కృష్ణాజిల్లా అధ్యక్షుడు జి.కృష్ణ కోరారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మకు యోగా పోటీల ఆహ్వానపత్రికను ఆయన గురువారం అందజేశారు. అనంతరం కృష్ణ మాట్లాడుతూ.. యోగా ఆసియా క్రీడల్లో ఇప్పటికే చోటు దక్కించుకుందని, ఒలింపిక్ క్రీడల్లో కూడా చేర్చేలా కృషి చేస్తున్నామని పేర్కొ న్నారు. ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు క్రీడాకారులు ఆసియా క్రీడల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు. జిల్లా స్థాయిలో ఈ నెల 19వ తేదీన ఉయ్యూరు దత్త కల్యాణ మండపంలో యోగా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలు జరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బెనర్జీ, కోశాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రేపు బీఎస్‌ఎన్‌ఎల్ నేషనల్ లోక్ అదాలత్
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వివిధ కోర్టుల్లో ఈ నెల ఐదో తేదీన బీఎస్‌ఎన్‌ఎల్ నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుందని సంస్థ విజయవాడ బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఎల్.శ్రీను గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, నూజివీడు, మచిలీపట్నం, కైక లూరు, గుడివాడ, అవనిగడ్డ, ఉయ్యూరు, గన్నవరం కోర్టుల్లో ‘నేషనల్ లోక్ అదాలత్’ జరుగుతుందని పేర్కొన్నారు. క్లోజ్ చేసిన బీఎస్‌ఎన్‌ఎల్ ఫోన్ల తాలూకు వినియోగదారులకు న్యాయసేవాధికార సంస్థల ద్వారా నోటీ సులు ఇచ్చామని, వారు కోర్టుకు హాజరుకా కుండా ముందుగానే బకాయిలు చెల్లించొచ్చని సూచించారు. ఈ నెల ఐదో తేదీలోపు వడ్డీ లేకుండా బకాయిలు చెల్లించొచ్చని, పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత తగిన రాయితీ కూడా పొందవచ్చని పేర్కొన్నారు. బకాయిల తీర్మానం జరిగిన తర్వాత సర్వీసులను పునరుద్ధరణ చేసుకోవచ్చని తెలిపారు. మరింత సమాచారం కోసం 0866 – 2444266/ 83338 98997/ 94901 88990/ 94901 45222 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
కృష్ణా డీఎస్‌ఓ పార్వతి బదిలీ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వి.పార్వతిని బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెను తూర్పుగోదావరి జిల్లా డీఎస్‌ఓగా ఉద్యోగోన్నతిపై బదిలీ చేశారు. ఆమె స్థానంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శివరామప్రసాద్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు.

కార్తికేయుని సేవలో ప్రముఖులు