
అల్లూరి, పింగళి చిరస్మరణీయులు
చిలకలపూడి(మచిలీపట్నం): స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్యలు చిరస్మరణీయులని కలెక్టర్ డీకే బాలాజీ కొనియడారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం అల్లూరి సీతారామరాజు జయంతి, పింగళి వెంకయ్య వర్ధంతి కార్యక్రమం సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో వారు చేసిన సాయుధపోరాటం ప్రత్యేక అధ్యాయమన్నారు. మన్యం వాసుల కష్టాలు కడతేర్చడానికి బ్రిటీష్ వారిని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం జరిపి ప్రాణత్యాగం చేశారన్నారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జిల్లా వాసి కావడం గర్వకారణమన్నారు. మహాత్మాగాంధీతో కలిసి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారన్నారు. ఇలాంటి ముఖ్యమైన నాయకుల కార్యక్రమాలు జరుపుకోవడం వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, ఇన్ చార్జి డీఆర్వో శ్రీదేవి, గిరిజన సంక్షేమాధికారి ఫణిధూర్జటి, కలెక్టరేట్ ఏవో ఏఎస్‌ఎన్ రాధిక, సిబ్బంది పాల్గొన్నారు.
నివాళులర్పించిన కలెక్టర్, జేసీ