
కృష్ణాజిల్లా
శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025
u8లో
అభినందనలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి గురువారం కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.
అన్యాయం చేశారు.. ఆదుకోండి
సుదూర ప్రాంతాలకు తమను బదిలీ చేశారని సచివాలయ గ్రామ వ్యవసాయ సహాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయంచేయాలని కృష్ణా కలెక్టర్ బాలాజీని కోరారు.
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు దంపతులు గురువారం రూ.లక్ష విరాళం సమర్పించారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ‘సుపారి పాలన’ను వివరించాలని ముఖ్య మంత్రి చంద్రబాబు ఆదేశించారు. అలివిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాం. వాటిని గాలికి వదిలేసి ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాం. సమస్యలు పరిష్కారం కాలేదంటూ అన్ని వర్గాల ప్రజలు రోడ్డుక్కుతున్నారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు ఇలా ఎవరిని కదిపినా నిప్పులు చెరుగుతున్నారు. పింఛన్లను కుదించాం. అన్ని పథకాలకు మంగళం పాడేశాం. తల్లికి వందనంలో కోతలు పెట్టాం. ఇప్పుడు ప్రజల వద్దకు ఎలా వెళ్లాలి? హామీలపై నిలదీస్తే వారికి ఏమని చెప్పాలి’ అని ఉమ్మడి కృష్ణా జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి మొదలైన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు తమకు అనుకూలమైన వారి ఇళ్లకే వెళ్లి మొక్కుబడిగా ముగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నెలరోజులు ఎలా నెట్టుకురావాలా అని తలలు పట్టుకొంటున్నారు.
దందాలపై నిలదీస్తారని భయం
ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకుల దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్లు వారు చేయని దందా లేదు. ఇసుక, మట్టి అక్రమ రవాణాతో రూ.కోట్లు కొల్లగొట్టారు. ఊరూరా బెల్ట్ షాపులు, పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆక్రమణలు, కబ్జాలు ఇబ్బడి ముబ్బడిగా చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ కేసులతో వేధించారు. వీటన్నింటితో ఐదేళ్ల తరువాత కనిపించాల్సిన ప్రభుత్వ వ్యతిరేకతను ఏడాదిలోని మూటగట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల ముందుకెళ్లేందుకు ముఖం చెల్లక కొంత మంది ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం, నందిగామ ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు. నందిగామ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని చిన్ని సుపరిపాలనలో భాగంగా కంచకచర్లలో పాల్గొన్నారు. తమకు అనుకూలమైన ప్రాంతంలో కేవలం నామ మాత్రంగా కొన్ని ఇళ్లకు మాత్రమే వెళ్లి కార్యక్రమాన్ని గంటలోపే ముగించారు.
కృష్ణా జిల్లాలో..●
● సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి మచిలీపట్నం 48వ డివిజన్‌లోని వడ్డెర కాలనీలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఎంపిక చేసుకున్న ఇళ్లకు మాత్రమే మంత్రి వెళ్లి పథకాల గురించి వివరించారు. కొన్ని ఇళ్ల వద్ద ప్రజలు తమ ప్రాంతంలో నాలుగు నెలలుగా వీధిదీపాలు వెలగటం లేదని, తాగునీరు సక్రమంగా సరఫరా కావటం లేదని మంత్రిని నిలదీశారు. పోతేపల్లి గ్రామంలో గురువారం ఇదే రీతిలో కార్యక్రమం సాగింది.
● అవనిగడ్డ నియోజకవర్గంలో మొక్కుబడిగా సుపరిపాలన కార్యక్రమం జరుగుతోంది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగిలిన ప్రాంతాల్లో పార్టీ నాయకులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కూడళ్ల వద్ద, కార్యకర్తల ఇళ్లకు వెళ్లి కార్యక్రమాన్ని ముగిస్తున్నారు. ఈ కార్యక్రమంపై టీడీపీ నాయకులకు సైతం ఆసక్తి లేకపోవటం గమనార్హం.
● పామర్రు నియోజకవర్గంలోని పామర్రు టౌన్‌లో జరిగిన సుపరిపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా పాల్గొన్నారు. ప్రకటించిన విధంగా ప్రతి ఇంటికి వెళ్లకుండా వారికి అనుయాయులుగా ఉన్న వారి ఇళ్ల వద్దకే వెళ్లి వారితోనే సమయం గడుపుతున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందనే ఆందోళనతో కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు.
● గుడివాడ నియోజకవర్గంలోని గుడివాడలో సుపరిపాలన కార్యక్రమం తూతూ మంత్రంగా జరుగుతోంది. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కార్యక్రమం జరుగుతుందనే సమాచారాన్ని ఎవరికీ ముందస్తుగా ఇవ్వకుండా కార్యకర్తల ఇళ్లకు వెళ్లి రెండు ఫొటోలు దిగి మమ అనిపిస్తున్నారు.
● పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు మండలం కాటూరు గ్రామాల్లో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గురువారం పర్యటించారు. ప్రధాన ప్రాంతాల్లో పర్యటించి టీడీపీ అనుకూల వ్యక్తుల ఇళ్లకు మాత్రమే వెళ్లారు. ప్రతి ఇంటికీ వెళ్లి ‘మై టీడీపీ’ యాప్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉండగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కార్యక్రమం మొక్కుబడిగానే సాగింది.
● గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం, రామవరప్పాడు గ్రామాల్లో సుపరిపాలన కార్యక్రమం గురువారం జరిగింది. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ కూడా టీడీపీ అనుకూల గ్రామాల్లో ఆ పార్టీ కార్యకర్తల ఇళ్లకు మాత్రమే వెళ్లి ఫొటోలు దిగి కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. పెడన నియోజకవర్గంలో సైతం కార్యక్రమం మొక్కుబడిగా సాగింది.
7
న్యూస్‌రీల్
సమస్యలు వద్దంటూ..
తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికిపూడికి సమస్యలతో ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. తిరువూరు మండలం, కోకిలంపాడులో రోడ్డు అధ్వానంగా ఉందని, మోకాలిలోతు గుంతలు, బురదతో నిండిందని, వాహనాలు గోతుల్లో ఇరుక్కుపోతున్నాయని, నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నామని గ్రామస్తులు బుధవారం ఫిర్యాదు చేశారు. ఇప్పుడు వచ్చింది సమస్యల గురించి కాదని, సంక్షేమ పథకాల గురించి వచ్చామంటూ ఎమ్మెల్యే కొలికపూడి మాట దాటవేశారు. ఎమ్మెల్యే ముందు సమస్యల గురించి చెప్పకుండా జనాలను టీడీపీ స్థానిక నాయకులు వారించారు. గురువారం సైతం అదే తంతు జరిగింది. తిరువూరులోని తొమ్మిదో వార్డులో డ్రెయిన్లు సరిగా లేక ఇబ్బంది పడుతున్నామని మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ‘ఇప్పుడు సమస్యల గురించి వద్దు. మీకు తల్లికి వందనం వచ్చిందా? లేదా? అంటూ వారు అడిగిన సమస్యను ఎమ్మెల్యే దాట వేశారు. జగ్గయ్యపేటలో సైతం తమకు అనుకూలమైన వారి ఇళ్లకే టీడీపీ నాయకులు వెళ్లారు. విజయవాడ వెస్ట్‌లో ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొదలైంది. విజయవాడ ఈస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల్లో కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది.
అన్ని ఇళ్లనూ సందర్శించని
టీడీపీ ఎమ్మెల్యేలు
ఎన్నికల హామీలపై ప్రజలు
నిలదీస్తారని ఆందోళన
తమకు అనుకూలమైన
వారి ఇళ్లకే వెళ్తున్న వైనం
సమస్యలు వద్దు.. సంక్షేమ పథకాలు
అందాయా లేదా అంటూ దాట వేత

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా