
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
గుడివాడరూరల్: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్‌ఐ మహబూబ్ షరీఫ్ మంగళవారం తెలిపారు. గుడివాడ రైల్వే స్టేషన్ పరిధిలోని దోసపాడు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు ఢీకొని ఓ వ్యక్తి మరణించినట్లు తెలిపారు. మృతుని వయస్సు 60ఏళ్లు ఉంటుందని, బ్లూబై కంపెనీ తెలుపు, నీలం రంగు గడులు గల చొక్కా(రెడీమేడ్ షర్ట్), తెలుపు, నలుపు, నీలం రంగు గడుల లుంగి ధరించి ఉన్నాడన్నారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 9440627570, 9866221412లో సంప్రదించాలని రైల్వే ఎస్‌ఐ కోరారు.