
మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వద్దు
గూడూరు: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ కార్యక్రమంలో ఎంపికై న గ్రామాల్లో కనీస మౌలిక వసతుల కల్పనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం మండల పరిధిలోని లేళ్లగరువు గ్రామాన్ని కలెక్టర్ సందర్శించారు. పంచాయతీలో నిర్వహిస్తున్న నీరు, పారిశుద్ధ్యం, ఎస్‌డబ్ల్యూపీసీ తదితర రిజిస్టర్లను పరిశీలించారు. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల, ప్రార్థనా మందిరాలను సందర్శించి అక్కడ ఉన్న వసతులపై ఆరా తీశారు. ఆయా ప్రదేశాలలో ఉపాధి హామీ నిధులతో ఇంకుడు గుంతలు, కంపోస్ట్ గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ప్రార్థనా మందిరం దగ్గర తడిచెత్త– పొడిచెత్త బుట్టలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పనుల నిర్వహణపై అసంతృప్తి..
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన చెక్‌లిస్ట్ ప్రకారం గ్రామంలో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయమై ఇప్పటికే స్పష్టమైన సూచనలు ఇచ్చినప్పటికీ పనులు నిదానంగా జరుగుతుండటం సహేతుకం కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. డీఎల్‌పీఓ మహమ్మద్ రజావుల్లా, డీఎల్‌డీఓ పద్మావతి, ఎంపీడీఓ కె.వి.రామకృష్ణ, తహసీల్దార్ రాజ్యలక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ నటరాజ్, సర్పంచి మానస, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులతో మమేకం..
మండల పరిధిలోని లేళ్లగరువు, కప్పలదొడ్డి పాఠశాలలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మమేకం అయ్యారు. లేళ్లగరువు పాఠశాలలో 8 మంది విద్యార్థులు మాత్రమే ఉండటంతో ఒకే టీచర్ ఉన్నారు. దీంతో కంకటావలో ఏర్పాటు చేసిన మోడల్ స్కూల్‌కు విద్యార్థులను పంపితే నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రులకు సూచించారు. కప్పలదొడ్డిలో విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ