పెద్దవాగు పరిసర ప్రాంతంలో పెద్దపులి
దహెగాం(సిర్పూర్): రెండు నెలల క్రితం బీబ్రా, పెసరికుంట గ్రామాల సమీపంలో సంచరించి పెద్దపులి చేడ్వాయి అటవీ ప్రాంతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. మరోసారి బుధవారం ఒడ్డుగూడ, లగ్గాం శివారులోని పెద్దవాగు పరిసర ప్రాంతాల్లో పెద్దపులి తిరిగినట్లు అధికారులు గుర్తించారు. పులి ఎటు వైపు వెళ్లిందనే కోణంలో పెంచికల్‌పేట్, దహెగాంల వైపు అటవీ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి గాలించారు. పెద్దవాగు పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తుందని వారు పేర్కొన్నారు. లగ్గాం గ్రామంలోని ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు. పెద్దవాగు పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాలకు గుంపులుగా, శబ్దం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు.


