పకడ్బందీగా సామగ్రి పంపిణీ చేయాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌రూరల్: ఎన్నికల సామగ్రి పకడ్బందీగా పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పా ట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జైనూర్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను ఆర్‌డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి బుధవారం పర్యవేక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 11న జైనూర్‌లో ఎన్నికలు జరుగుతాయన్నారు. అవసరమైన షామియానాలు, కుర్చీలు, టేబుళ్లు, తాగునీరు, ఇతర ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి ఉమర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.


