‘సికిల్ సెల్’ నివారణే లక్ష్యం
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో సికిల్‌సెల్ వ్యాధిని పూర్తిస్థాయిలో నివారించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని మాతాశిశు సంరక్షణ కేంద్రం కోఆర్డినేటర్ వాసుదేవ్ అన్నారు. జిల్లాలో పలువురికి సికిల్ సెల్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, బుధవారం జిల్లా కేంద్రంలో జెనెటిక్స్ కార్డులు అందించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి అవసరమైన మందులు అందిస్తామని తెలిపారు. సికిల్‌సెల్ నివారణ కోసం క్షేత్రస్థాయిలో పరీక్షలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పీలు శిరీష, కవిత, ప్రేమలత, సౌమ్య, ఉమ తదితరులు పాల్గొన్నారు.


