దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): దివ్యాంగులు వైకల్యంతో కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో అన్నిరంగాల్లో ముందుకు సాగాలని బెల్లంపల్లి ఏరియా ఇన్‌చార్జి జనరల్ మేనేజర్ మచ్చగిరి నరేందర్ అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని సీఈఆర్ క్లబ్‌లో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దివ్యాంగ చిన్నారులకు క్రీడాపోటీలు నిర్వహించారు. ఇన్‌చార్జి జీఎం మాట్లాడుతూ దివ్యాంగులు శారీరకంగా కొంత బలహీనంగా కనిపించినా మానసికంగా దృఢ సంకల్పంతో ఉంటారని తెలిపారు. ఆత్మస్థైర్యంలో అనుకున్న లక్ష్యాలు సాధించాలని సూచించారు. అనంతరం చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. క్రీడాపోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమాల్లో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, అధికారుల సంఘం ప్రతినిధి ఉజ్వల్‌కుమార్ బెహరా, ఎస్వోటూజీఎం రాజమల్లు, పర్సనల్ డిపార్టుమెంట్ హెచ్‌వోడీ ఎం.శ్రీనివాస్, సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్, ఉపాధ్యాయులు సుజాత, ఆర్.వెంకటేశ్వర్లు, సుచిత, రేష్మా, సతీశ్, పీఈటీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


