బరిలో నిలిచేదెవరో..?
కెరమెరి(ఆసిఫాబాద్): తొలి విడత నామినేషన్ల ప్రక్రి య తుది దశకు చేరుకుంది. బుధవారం నామినేష న్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. సాయంత్రం తుది జాబితాను ప్రకటించి గుర్తులు కేటాయించనున్నారు. దీంతో బరిలో నిలిచేదెవరో తేలనుంది. జైనూర్ మండలంలోని 26 సర్పంచ్ స్థానాలకు 126 నామినేషన్లు రాగా, కెరమెరి మండలంలో 31 పంచాయతీలకు 154, లింగాపూర్‌లో 14 పంచాయతీలకు 79, సిర్పూర్–యూలో 15 పంచాయతీలకు 56, వాంకిడిలో 28 పంచాయతీలకు 106 నామినేష న్లు వచ్చాయి. ఆయా మండలాల్లో వార్డు సభ్యుల స్థానాలకు 1,424 నామినేషన్లు దాఖలయ్యాయి. జి ల్లాలో అత్యధిక పంచాయతీలు ఉన్న కెరమెరి మండలంలో 11 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యా యి. ఈ మండలంలోని 250 వార్డులు ఉండగా 11 వార్డులకు నామినేషన్ దాఖలు కాలేదు. జోడేఘాట్‌లో రెండు, రింగన్‌ఘాట్‌లో 2, పార్డలో ఒకటి, కొఠారిలో రెండు, అగర్‌వాడలో రెండు, ఝరి, సావర్‌ఖేడాలో ఒక్కో వార్డులో ఎవరూ పోటీకి ముందుకు రాలేదు. మంగళవారం అధికారులు అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు నామినేషన్లు ఉపసహరించుకోవాలనుకుంటే సకాలంలో రావాలని కెరమెరి ఎంపీడీవో సురేశ్ సూచించారు.


